Friday, April 26, 2024

డ్రైనేజీలో దిగి నిర‌స‌న వ్య‌క్తం చేసిన – ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

ఇటీవ‌ల గుండెపోటుకి గురై చెన్నై అపోలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందారు నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి.
ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన నియోజకవర్గంలో చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్నారు. తాజాగా ఆయ‌న వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డిగుంటలో గత కొంతకాలంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది ..

రైల్వే అధికారులు అనుమతి లేకపోవడంతో డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయింది. దీంతో అధికారులు పట్టించుకోవడం లేదని.. మురికి కాలువలోకి దిగి ఎమ్మెల్యే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి స్వయంగా ఎమ్మెల్యేనే డ్రైనేజీలోకి దిగి నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. గెలిపించిన ప్రజలు సమస్యలు పరిష్కరించడం లేదని తనను ప్రజలు నిలదీస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి తాను కూడా బాధ్యుడనని అని తెలిపారు. రైల్వే అధికారుల సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో స్పందించిన రైల్వే అధికారులు జూలై 15 లోపు పనులు మొదలు పెడతామని ఆయనకు హామీ ఇచ్చారు. సమస్య పది రోజుల్లో పరిష్కారమవ్వాలని లేకపోతే ఈసారి డ్రైనేజీలో పడుకొని నిరసన వ్యక్తం చేస్తానని కోటంరెడ్డి అధికారులను హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement