Wednesday, May 8, 2024

Breaking: ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో అంటూ మోడీకి కేటీఆర్ లేఖ రాశారు. మోడీ గారూ.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండని అన్నారు. సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా డెవలప్ మెంట్ నుంచి మాట్లాడండని తెలిపారు. మీ పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాలు నింపుకున్న మీరు.. పనికొచ్చే విషయాలు చర్చిస్తారనుకోవడం అత్యాశేనన్నారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు.. ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యముందనుకోవడం లేదని లేఖ లో తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలు, సుపరిపాలన విధానాలపై అధ్యయనం చేయండని అన్నారు. డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. కొత్త ఆలోచనా విధానానికి తెలంగాణ గడ్డ నుంచి నాంది పలకండని కేటీఆర్ లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement