Sunday, June 4, 2023

కోరుట్ల నర్సరీ అందాలకు మంత్రి కేటీఆర్ ఫిదా..

జగిత్యాల : కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీ లోని విరబూసిన గులాబీ అందాలకు మంత్రి
కే తారక రామారావు ముగ్ధుడయ్యారు. నర్సరీ ఫొటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో శనివారం రాత్రి పోస్ట్ చేసి…
ఈ అందమైన ఫొటోలు ఎక్కడ నుండి వచ్చాయో ఊహించండి? అంటూ నెటిజన్లను మంత్రి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీ లోని విరబూసిన గులాబీలు అంటూ తానే సమాధానం ఇచ్చారు. కోరుట్ల నర్సరీ లాగే రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధిశాఖ శాఖ తెలంగాణలోని 141 పట్టణాల్లో 1012 నర్సరీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 600 నర్సరీలు ఉన్నట్లు తెలిపారు. గ్రేట్ జాబ్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్.. మంచి పనిని కొనసాగించండి అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కే తారక రామారావు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement