Sunday, June 4, 2023

నేడు ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ – మెట్రో, ఆర్టీసీ బస్సుల స‌ర్వీస్ ల పెంపు..

హైద‌రాబాద్ – ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ స్టేడియంలో నేడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం టీఎస్ ఆర్టీసీ ఉప్పల్ కు అదనంగా బస్సులు తిప్పుతోంది. మధ్యాహ్నం 12:20 గంటల నుంచి సర్వీసుల పెంచనున్నట్లు మెట్రో రైల్ కూడా ప్రకటించింది. ప్రతి రెండు, మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలు ఉప్పల్ వైపు పరుగులు తీస్తుందని పేర్కొంది అలాగే న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి ఉప్ప‌ల్ స్టేడియంకు ప్ర‌త్యేక ఆర్టీసీ సిటీ స‌ర్వీస్ లు న‌డ‌ప‌నున్న‌ట్లు ఆర్టీసీ ప్ర‌క‌టించింది.. మెట్రో, ఆర్టీసీ స‌ర్విస్ లు ఉప్ప‌ల్ స్టేడియం వ‌ద్ద నేటి ఆర్ధ‌రాత్రి వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.. క్రికెట్ ప్రేమికులు త‌మ స్వంత వాహ‌నాలు వ‌దిలి ప్ర‌జా ర‌వాణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌ల‌సిందిగా ఈ రెండు సంస్థ‌లు పిలుపు ఇచ్చాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement