Tuesday, May 14, 2024

అందరూ మట్టి గణపతులనే పూజించాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం నుంచి అన్ని మతాల పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. వచ్చే గణేష్ ఉత్సవాలను కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులందరూ శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తాము ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇళ్లలో కూడా ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: రేపు మోత్కుపల్లి నర్సింహులు ఒక్కరోజు నిరాహార దీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement