Wednesday, May 15, 2024

నిజాయితి (ఆడియోతో…)

ఆధ్యాత్మిక నిజాయితి అనగా, ”నీకు సంబంధించిన స్వయాన్ని సొంతం చేసుకోవడానికి సత్యంగా ఉండటము”. మహోన్నత్వానికి నిజాయితి ఒక మూల స్తంభం. భగవంతుని ప్రేమను ప్రత్యక్షంగా అనుభవం చేసుకుని, భగవంతుడు మరియు నేను ఎంతో సమీపంగా ఉన్నాము అన్న భావనను కలిగిస్తుంది. ఈ అనుభంలో ఎంతో శక్తి ఉంది. దురదృష్టం ఏమిటంటే, ఇటువంటి మహోన్నత్వాన్ని ఎంతో సహజంగా అనుభవించడానికి బదులుగా చాలామంది ఇటువంటి అవకాశాన్ని ఎన్నో సాకులు చెప్పి జారవిడుచుకుంటున్నారు. అబద్ధాలు చెప్పడం నిజాయితీలేమికి ప్రత్యక్ష రూపం, కానీ సాకులు చెప్పడం అంతకన్నా అధ్వాన్నము.

తప్పులు సాధారణంగా గమనించేవిగానే ఉంటాయి కానీ సాకులు చెప్తున్నాము అనిఅర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ మోసంతోటే జీ వితంలోని చాలా భాగం గడిచిపోతూ ఉంటుంది. ఏ ఏ సాకులు నిన్ను భగవంతుడికి సమీపంగా ఉండనివ్వడం లేదు అని ఒక్కసారి ఆలోచించు!

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement