Sunday, April 28, 2024

డెల్టా వేరియంట్‌తో ముప్పు రెండు రెట్లు ఎక్కువ

కరోనా వైరస్ వేరియంట్ డెల్టా వేరియంట్‌తో ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు రెండు రెట్లు అధిక‌మ‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. బ్రిట‌న్‌లో 40వేల కోవిడ్‌-19 కేసుల వివ‌రాల‌ను ప‌రిశీలించిన మీద‌ట లాన్సెట్ ఇన్ఫెక్షియ‌స్ డిసీజెస్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ఈ విష‌యం నిగ్గుతేల్చింది. ఆల్ఫా స్ట్రెయిన్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డ‌తార‌ని గ‌తంలో వెల్ల‌డైన అంశాల‌ను తాజా అధ్య‌య‌నం నిర్ధారించింది.

అధ్య‌య‌నంలో పాల్గొన్న‌వారిలో ప‌లువురు వ్యాక్సినేష‌న్ పూర్తికాని కేసులో ఉన్నా డెల్టా తీవ్ర‌తను ఇది వెల్ల‌డిస్తోంద‌ని ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లండ్‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్ఫెక్ష‌న్ స‌ర్వీస్ క‌న్స‌ల్టెంట్ ఎపిడెమాల‌జిస్ట్ గవిన్ డ‌బ్రెరా పేర్కొన్నారు. డెల్టా నుంచి వ్యాక్సినేష‌న్ మెరుగైన రక్ష‌ణ క‌ల్పిస్తోంద‌ని, బ్రిట‌న్‌లో న‌మోద‌వుతున్న కేసుల్లో 98 శాతం పైగా డెల్టా కేసులే ఉన్నందున ప్ర‌జ‌లు రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని డ‌బ్రెరా కోరారు. ఇక అధ్య‌య‌నం నిర్వహిస్తున్న స‌మ‌యంలో తాము 34,656 ఆల్ఫా కేసులు., 8682 డెల్టా కేసుల‌ను ప‌రిశీలించామ‌ని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement