Sunday, April 28, 2024

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం: సబిత

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆమె తలిపారు. శనివారం ఆమె బషీర్‌బాగ్‌లోని గన్‌ ఫౌండ్రీ డివిజన్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేనతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల.. ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల 26 నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు రావాలని ఆదేశించినట్లు సబిత చెప్పారు. ఒకటో తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధ పాత్రిపదికన సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని, ఇదే స్ఫూర్తి ముందు కొనసాగాలన్నారు. సీఎం కేసీఆర్‌ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదేశించారని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: అందరూ మట్టి గణపతులనే పూజించాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement