Saturday, May 4, 2024

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ఆశాజ్యోతిగా – బిఎన్‌ఐ

హైదరాబాద్‌ : 74కు పైగా దేశాలతో పాటు భారతదేశంలోని 110కి పైగా నగరాలలో తన ఉనికిని కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద రెఫరల్‌ ఆర్గనైజేషన్‌గా ఉన్నటువంటి బిఎన్‌ఐ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ (మైక్రో, స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌), సోలోప్రెన్యూర్స్‌ (సొంతంగా వ్యాపారాన్ని స్థాపించి,నడిపించే వ్యక్తులు) మరియు స్టార్ట్‌-అప్‌ వంటి వ్యవస్థలకు కూడా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ఒక ఆశాకిరణంగా ఉన్నది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అత్యంత గందరగోళ పరిస్థితులతో ఇంతకు ముందెన్నడూ ఊహించని అంతరాయాల కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతినడం , తీవ్ర ప్రభావాలకు గురికావడం వంటివి కొనసాగుతున్నప్పటికీ, తన సభ్యులకు బిఎన్‌ఐ ఒక భారీ మద్దతు వ్యవస్థగా నిలిచి సభ్యులకు అనేక అవకాశాలను అందించింది. వాస్తవానికి బిఎన్‌ఐ లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ అవకాశాన్ని వేగంగా అందిపుచ్చుకున్నది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన 2.85 లక్షల సభ్యుల యొక్క నెట్‌వర్క్‌ ద్వారా ప్రపంచవ్యాప్త సహకారానికి బహిరంగ అవకాశాలకు ద్వారాలు తెరవడం ద్వారా సభ్యులు అభివృద్ధి చెందడానికి సహాయపడిరది.

బిఎన్‌ఐ లిఖించిన ఈ విజయగాథలో ముందువరుసలో ఉన్నవాటిలో బిఎన్‌ఐ, హైదరాబాద్‌ రీజియన్‌ ఒకటి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన బిజినెస్‌లో హైదరాబాద్‌ ప్రాంతం 65%తో అద్బుత వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఈ రీజియన్‌ 10 చాప్టర్‌లను ప్రారంభించింది, ప్రపంచవ్యాప్తంగా నిరాశజనకమైన వ్యాపార సెంటిమెంట్‌ కొనసాగుతున్నప్పటికీ, అదే రోజు 4 చాప్టర్‌లను ప్రారంభించడం ద్వారా బిఎన్‌ఐ ప్రపంచ రికార్డుతో చరిత్రను సృష్టించింది. బిఎన్‌ఐ హైదరాబాద్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సంజనా షా ఆధ్వర్యంలో సాధించిన ఈ అద్భుత విజయం ఆమెకు ,రీజియన్‌కు ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకునేలా చేసింది. ఆమె అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను గుర్తించి, బిఎన్‌ఐ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఇవాన్‌ మిస్నర్‌ తన ప్రతిష్టాత్మక సలహా కమిటీలో సంజనా షాను భాగస్వామిని చేశాడు.ప్రత్యేకించి మనం ఇంతకు ముందెన్నడూ ఊహించని అవాంతరాలు మరియు నిరంతర సవాళ్లను చూసున్న ప్రస్తుత సమయంలో, మునుపెన్నడూ లేనంతగా నేడు, బిఎన్‌ఐ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌ల విజయానికి బాటలు వేసే మార్గంగా ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో బిఎన్‌ఐ వ్యవస్థలు స్థిరంగా ఉండటానికి మరియు కష్టతరమైన అడ్డంకులను అధిగమించడానికి మాకు ఎలా దోహదపడ్డాయనే దాని గురించి సభ్యులుగా మాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నదని, సంజనా షా తెలిపారు.

బిఎన్‌ఐ, గివర్స్‌ గెయిన్‌ (ఈ తత్వాన్ని అవలంబించే వ్యక్తులు తాము వ్యాపారాన్ని సంపాదించుకోవడంలో తమ ముందున్న ఆందోళన కంటే తమ తోటి నెట్‌వర్కర్‌లకు వ్యాపారాన్ని అందించడానికి అంకితం అవుతారు) అనే ముఖ్య సూత్రం యొక్క ప్రయత్నంలో భాగంగా, ఈ గివింగ్‌ సీజన్‌లో రెండు వందల మందికి పైగా సభ్యులు శాంటా క్యాప్‌ను ధరించారు మరియు ఈరోజు హోటల్‌ మారిగోల్డ్‌లో నగరంలో ఇటీవలి కాలంలో నిర్వహించిన అతిపెద్ద 121 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. సభ్యులు ఒకరి వ్యాపారాన్ని మరొకరు తెలుసుకోవడం, వారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచుకోవడం, రిఫరల్స్‌ను రూపొందించడం మరియు సహకార అవకాశాలను అన్వేషించడం కోసం సమిష్టి కృషి చేశారు. నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు డాక్టర్‌ మణి పవిత్ర మరియు ప్రదీప్‌ యలగడ్డ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ, వ్యక్తులకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించి నిర్ణయం తీసుకోవడంలో మరియు పెట్టుబడులను పెంచడం ద్వారా అభివృద్ధి చెందడంపై దృష్టి సారించే ఫార్చ్యూన్‌ అకాడమీ ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ 121 కాన్‌క్లేవ్‌ను స్పాన్సర్‌ చేసింది.మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement