Tuesday, April 23, 2024

కోర్టు ఆదేశాలు అమ‌లు చేస్తే మంచిది – సీజేఐ హోదాలో తొలిసారి అమ‌రావ‌తికి ‘ఎన్వీ ర‌మ‌ణ‌’

విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్‌ సవాళ్లు’ అనే అంశంపై ‘లావు వెంకటేశ్వర్లు 5వ ఎండోమెంట్‌ లెక్చర్‌’ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. దేశంలో చట్టబద్ధమైన పాలన సాగేందుకు సహకరించాల్సిన కార్యనిర్వాహక వర్గం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతోపాటు అవమానించే ధోరణి పెరుగుతోందని అన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేసినప్పుడే మంచి జ‌రుగుతుంద‌న్నారు. దేశంలో చట్టబద్ధమైన పాలన సాగడానికి కార్యనిర్వాహక వర్గం సహాయం, సహకరించాలన్నారు. చట్టాలను రూపొందించడానికి కార్యనిర్వాహక, చట్టం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్ప, న్యాయవ్యవస్థ మాత్రమే బాధ్యత వహించద‌ని జస్టిస్ రమణ అన్నారు.

కాగా సీజేఐ హోదాలో తొలిసారి అమ‌రావ‌తి విచ్చేశారు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిన్ ఎన్వీ ర‌మ‌ణ‌. ప‌లు రోజులుగా ఆయ‌న తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చిన ఆయన నేడు అమరావతి వచ్చారు.ఈ సందర్భంగా ఆయనకు రాజధాని జేఏసీ నేతలు, రైతులు రాయపూడి వద్ద ఘనస్వాగతం పలికారు. ఆకుపచ్చ కండువాలు ధరించి, జాతీయ జెండాలు చేతబూని నినాదాలు చేశారు. ఓపెన్ టాప్ కారులో వచ్చిన ఎన్వీ రమణ, పైకి లేచి నిల్చుని రైతులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన ఏపీ హైకోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది సీజేఐ ఎన్వీ రమణ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు, పెద్ద సంఖ్యలో జ్ఞాపికలు బహూకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement