Friday, May 20, 2022

మహారాష్ట్ర వేదికగా మెగాలీగ్.. మార్చి 27నుంచి ఐపీఎల్‌ 2022..

ఇండియన్‌ ప్రీమియల్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 ఎడిషన్‌ను మార్చి 27నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మరో రెండు జట్లు లక్నో, అహ్మదాబాద్‌ కొత్తగా అడుగుపెట్టనుండటంతో అభిమానులు మరింత ఆసక్తిగా మెగాలీగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసినా వారంముందే టోర్నీ నిర్వహించాలని భావిస్తుంది. కాగా ఐపీఎల్‌ జట్లు యాజమాన్యంతో శనివారం బీసీసీఐ సమావేశమైంది. ప్రాథమిక చర్చల ప్రకారం ఐపీఎల్‌ను స్వదేశంలో మహారాష్ట్రలో నిర్వహించాలని నిర్ణయించారు.

దీనిప్రకారం తొలి మ్యాచ్‌ ముంబైలో జరగనుంది. కరోనా ముప్పు పొంచి ఉండటంతో ప్రేక్షకులు లేకుండానే మెగాలీగ్‌ నిర్వహించనున్నారు. ముంబై, పుణలోని నాలుగు వేదికల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌ నిర్వహించనున్నారు. శనివారం బీసీసీఐ నిర్వహించిన ఈ సమావేశానికి అంబానీలతోపాటు ఎన్‌ శ్రీనివాసన్‌, షారుఖ్‌ఖాన్‌, ప్రీతీజింటా, పార్థ్‌ జిందాల్‌ తదితరులు హాజరయ్యారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి చివరివారంలో ప్రారంభమై మే చివరి వారంలో ముగియనుంది. కాగా ఐపీఎల్‌ 2022పై బీసీసీఐ త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement