Tuesday, March 26, 2024

Big Story: 79 రోజులుగా మారని రేట్లు.. స్థిరంగా కొనసాగుతున్న ‘పెట్రో’ ధరలు..

79 రోజులుగా పెట్రోలు ధరల్లో ఎట్లాంటి మార్పులేదు. 2017 జూన్ లో పెట్రోలు ధరలపై రోజువారీ రేట్ రివిజన్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతగా ధరలు తగ్గించకుండా ఉండడం ఇది రెండోసారి మాత్రమే. దేశంలో లాక్ డౌన్ ఉన్నప్పుడు 2020 మార్చి 17 నుంచి జూన్ 6వ తేదీ వరకు అంటే దాదాపు 82 రోజుల పాటు ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు పెంచకుండా స్థిరంగా కొనసాగించాయి. ఆ తర్వాత 79రోజుల విరామం ఇవ్వడం ఇది రెండోసారి అంటున్నారు పరిశీలకులు.

మెట్రో నగరాల్లో పెట్రోలు రేటు ఇలా…

CityPetrolDiesel
Delhi95.4186.67
Mumbai109.9894.14
Chennai101.4091.43
Kolkata104.6889.79
Hyderabad108.1894.61

గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్నును 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8.56 తగ్గింది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.109.98 రూపాయలుగా ఉంది. అయితే డీజిల్ ధర మాత్రం లీటరుకు రూ.94.14 గా ఉంది. మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఇప్పటికీ ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి -డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, చమురు ధరలు గత వారం ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత పడిపోయాయి. US క్రూడ్, ఇంధన నిల్వలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు లాభాలను స్వీకరిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2.46 డాలర్లు లేదా 2.8 శాతం తగ్గి 85.92 డాలర్లకు పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement