Friday, April 26, 2024

Breaking : క‌ర్ణాట‌క‌లో మంకీ ఫీవ‌ర్ – 57ఏళ్ల మ‌హిళ‌లో ల‌క్ష‌ణాలు

రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో మంకీ ఫీవ‌ర్ కేసు వెలుగులోకి వ‌చ్చింది. షిమోగా జిల్లాకు చెందిన 57ఏళ్ల మ‌హిళ‌కి మంకీ ఫీవ‌ర్ సోకింద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది.జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement