Saturday, April 27, 2024

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు.. బిగ్గెస్ట్ రియాల్టి షో అంటూ వీడియో

ఇటీవల మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో మంచు విష్ణు ఎవరితోనే గొడవపడుతూ కనిపించాడు. కాసేపటికే ఆ వీడియోని మనోజ్ డిలీట్ చేశాడు.. అయిన సోషల్ మీడియాలోని ట్రోలర్స్ ఆ వీడియోని ముందే సేవ్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే, ఇప్పుడు అదే వీడియోను బేస్ చేసుకునే మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ.. ఇండాయాస్ బిగ్గెస్ట్ రియాల్టి షో #HouseOfManchus అని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో మంచు మోహన్ బాబు, విష్ణుభార్య విరానికా రెడ్డి కూడా కనిపించారు. ఆ వీడియోకి చివర్లో.. Indias Biggest Reality Show #HouseOfManchus అని ప్రకటించారు. ఈ వీడియో చూసి .. ఏంటి అదంతా ప్రాంకా? లేకపోతే దానిని కవర్ చేసుకోడానికి ఇలా ప్లాన్ చేశారా? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. ట్విస్ట్ అదిరిపోయిందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రియాలిటీ షో ఈ ఏడాదే స్ట్రీమింగ్ కు వస్తుందని కూడా చెప్పేశారు. ఇంతకీ ఆ రియాలిటీ షో ఏంటి ?ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం రివీల్ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement