Saturday, June 3, 2023

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న “రావణాసుర”

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “రావణాసుర” మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.ఇక వచ్చే నెల (ఏప్రిల్) 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. కగా, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఉన్న వైలెన్స్ కారణమైన CBFC ఈ మూవీ ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలస్తోంది. అయితే, మూవీ రన్‌టైమ్ ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్షా నాగర్కర్, పూజిత పొన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. జయరామ్, శ్రీరామ్, హైపర్ ఆది, హర్షవర్ధన్, మురళీ శర్మ, సంపత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ & RT టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకులుగా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement