Saturday, April 27, 2024

ట్రాఫిక్ లో విసుగొచ్చి.. నదిలో దూకాడు..అరెస్ట్ అయ్యాడు..

ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు..హరన్ కొడుతూ.. విసుగెత్తిపోతారు..ఆ తరువాత మనచేతిలో ఏముందని..ట్రాఫిక్ క్లీయర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు.. కాని వాషింగ్టన్ లోని ఓ వ్యక్తి బోర్‌ కొట్టిందని ఓ పిచ్చి పని చేశాడు. రోడ్డు ప్రక్కనే ఉన్న మొసళ్ల నదిలోకి దూకాడు. అమెరికాలోని లూసియానాకు చెందిన జిమ్మి ఇవాన్‌ జెన్నింగ్స్‌ కొద్ది రోజుల క్రితం నదిపై ఉన్న వంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. 2 గంటలు గడిచినా ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. దీంతో బోర్‌ కొట్టిన జిమ్మి పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు. నదిలో దాదాపు గంటన్నర పాటు ఈదుతూనే ఉన్నాడు. ఈత కొట్టే ఓపిక నశించినా ప్రాణం మీద ఆశతో అంటూ ముందుకు వెళ్లాడు. చివరకు ఓ ఇసుక తిన్నెమీదకు చేరుకున్నాడు. అయితే ఆ నదిలో ముసళ్లు ఉన్నట్లు అతడికి తెలియదు. నీళ్లలో పడ్డ తర్వాత అతడి నోటికి, ఎడమ చేతికి గాయమైంది. ఆ తర్వాత నడుచుకుంటూ ఊర్లోకి అడుగుపెట్టాడు. అక్కడ పోలీసులు జిమ్మిని అరెస్ట్‌ చేశారు.

YouTube video

ఇది కూడా చదవండి: పదో తరగతి స్లిప్‌ టెస్ట్‌ కు 70శాతం వెయిటేజీ

Advertisement

తాజా వార్తలు

Advertisement