Thursday, April 25, 2024

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ కరోనా టెస్టు కిట్


ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ భారతదేశపు మొట్టమొదటి రాపిడ్ ఎలక్ట్రానిక్ కోవిడ్ -19 ఆర్‌ఎన్‌ఎ టెస్ట్ కిట్‌ “కోవిహోమ్” ను అభివృద్ధి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పరిశోధకులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-శక్తితో కూడిన కోవిడ్-19 టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేశారు. దీంతో ఇంట్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా ఉందా? లేదా? అన్నది 30 నిమిషాల్లో ఫలితాలు ఇస్తుంది. అతి తక్కువ ఖర్చుతో దీనిని రూపొందించారు. అయితే, దీనిని ఐసీఎంఆర్ ఆమోదం పొందాల్సి ఉంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement