Sunday, May 5, 2024

భారీగా పెరిగిన మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఆటో అమ్మకాలు

మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటి (ఎల్‌ఎంఎం) 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా త్రీ వీలర్‌ వాహనాలను విక్రయించింది. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 36,816 విద్యుత్‌ ఆటోలను విక్రయించి దేశంలోనే అత్యధిక ఈవీ త్రీ వీలర్స్‌ అమ్మకాలు జరిపిన కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ ఈ రంగంలో 14.6 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 17,522 ఈవీ ఆటోలను విక్రయించింది.

- Advertisement -

దేశవ్యాప్తంగా 1150 టచ్‌ పాయింట్లు, 10 వేలకు పైగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు మహీంద్రా ఎల్‌ఎంఎం తెలిపింది. మహీం ద్రా కంపెనీ ఈవీ జోర్‌ గ్రాండ్‌ అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది. దీనితో పాఉ ట్రియో రేంజ్‌ వాహనాలు, ఆఎఫ్గాస్‌ మిని కార్గో త్రీ వీలర్స్‌ కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు కంపెనీ లక్షకు పైగా ఈవీ త్రీ వీలర్స్‌ను విక్రయించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement