Friday, May 17, 2024

మేలో పెరిగిన దేశీయ విమాన ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మే నెలలో 2.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌ నెలలో 128.9 లక్షల మంది దేశీయ విమాన ప్రయాణికులు నమోదైయ్యారు. మే నెలలో ఈ సంఖ్య 131.8 లక్షలకు పెరిగింది. 2022 మే నెలలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మే నెలలో 15 శాతం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కోవిడ్‌ కంటే ముందు 2019 మే నెలతో పోల్చుకుంటే ఈ మే లో ప్రయాణికుల సంఖ్య 8 శాతం పెరిగింది.

దేశీయ ప్రయాణీలకు చేరవేసే సామర్ధ్యం విమానయాన సంస్థలకు 1.4 శాతం పెరిగింది. కోవిడ్‌ ముందు నాటి ప్రయాణికుల సంఖ్యను అధిగమించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మన దేశం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 239.4 లక్షలుగా ఉంది. కోవిడ్‌ కంటే ముందు 2020లో ఈ సంఖ్య 227.2 లక్షలుగా ఉంది. 2029లో మాత్రం అత్యధికంగా 259 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు నమోదయ్యారు. దీంతో పోల్చితే ప్రస్తుతం 8 శాతం తక్కువగా ఈ సంఖ్య ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.

- Advertisement -

ఇండియన్‌ ఏవియేషన్‌ రంగం వృద్ధిపై ఇక్రా నెగిటివ్‌ నుంచి పాజిటీవ్‌ రేటింగ్‌ ఇచ్చింది. 2022-23 సంవత్సరం విమానయాన రంగం వేగంగా పుంజుకుంది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే వృద్ధి 2024లోనూ కొనసాగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఇటీవల టికెట్ల రేట్లు పెరగడంతో విమానయాన సంస్థ ఆదాయం పెరిగిందని తెలిపింది. టికెట్ల ధరలు, విమాన ఇంధన ధరలు స్థిరంగా ఉండటం, విదేశీ మారకం విలువ వంటిపై ఆధారపడి 2023-24 ఆర్ధిక సంవత్సరంలోనూ విమానయాన రంగం సరైన దిశలోనే వృద్ధిని నమోదు చేస్తుందని ఇక్రా అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement