Saturday, September 23, 2023

Breaking | ఇటుక లారీ బోల్తా.. ద్విచక్ర వాహనదారుడు మృతి

ఇటుక లారీ బోల్తా పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది. శనివారం పెద్దపల్లి నుండి కరీంనగర్ కు ఇటుకలోడు తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అటువైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీ కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడు శివపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ జగదీష్,ఎస్సై విజయేందర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement