Friday, June 21, 2024

HYD: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మంత్రి తలసానికి ఆహ్వానం

హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం వారు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి సంవత్సరం వివిధ రకాల అవతారాలతో ఖైరతాబాద్ గణనాధుడు లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇస్తారని, ఈ సంవత్సరం శ్రీ దశ మహా విద్యా గణపతి అలంకారాలలో దర్శనం ఇస్తారని నిర్వహకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సందీప్ రాజ్, రాజ్ కుమార్, సురేందర్, బాల్ కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement