Monday, May 6, 2024

కోహ్లీ స‌చిన్ స‌ల‌హా తీసుకోవాలి

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో తన బ్యాటింగ్‌లో విఫలమ‌వుతున్నాడు. కోహ్లీ బలహీనతను అధిగమించాలంటే క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ నుంచి సలహా తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. విరాట్ కోహ్లీ నూతన సంవత్సరం సందర్భంగా సచిన్ టెండూల్కర్‌కు శుభాకాంక్షలు తెలిపి.. ఓ సలహా అడిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. గతంలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆన్‌సైడ్‌ మాత్రమే షాట్లు ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు నాటౌట్ గా నిలిచాడు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు కోహ్లీ కూడా అదే పరీక్షను ఎదుర్కోవాలని నెటిజన్లు అంటున్నారు. కొత్త సంవత్సరంలో కోహ్లీ బలహీనతను అధిగమిస్తే మరిన్ని అద్భుత శతకాలు చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విష‌యాన్ని ఆకాష్ చోప్రా కూ యాప్ లో పోస్ట్ చేశాడు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement