Wednesday, April 24, 2024

RADHE SHYAM: ‘రాధేశ్యామ్’ వాయిదా? సంక్రాంతికి వచ్చేది డౌటే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. పండగకే మూవీ రిలీజ్ అవుతుందని చెబుతున్నా.. సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒమిక్రాన్ దెబ్బతో భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడగా.. ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా వాయిదా పడుతుందన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈ సినిమా డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్ రాధేశ్యామ్ విడుదలపై అనుమానాలు పెంచుతోంది.

“సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి. టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో రాధేశ్యామ్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement