Saturday, April 27, 2024

కార్తికేయ‌2 ట్రైల‌ర్ కి – 9మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్

కార్తికేయ‌2 చిత్ర ట్రైల‌ర్ కి 9మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ ద‌క్కాయి. ఈ చిత్రంలో నిఖిల్..అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇంతవరకూ ఈ ట్రైలర్ 9 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకుంది. చాలా వేగంగా ఈ ట్రైలర్ ఈ స్థాయి వ్యూస్ ను అందుకోవడం విశేషంగా చెబుతున్నారు. నిఖిల్ జోడీగా అనుపమ అలరించనుంది. అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ‘నా వరకూ వచ్చేవరకే సమస్య .. నా వరకూ వచ్చాక సమాధానం’ అంటూ నిఖిల్ సందడి చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. హీరో దైవ సంబంధమైన కార్యమేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమైంది. అంతకు మించి మిగతా విషయాలేవీ రివీల్ చేయలేదు. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement