Saturday, April 27, 2024

జియో స్మార్ట్ ఫోన్ ధర లీక్… రూ.500కే ఫోన్

జియో, గూగుల్ భాగస్వామ్యంలో రానున్న స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ ధర మళ్లీ ఆన్‌లైన్‌లో లీకైంది. అయితే గతంలో లీకైన ధరకు దీనికి మధ్య కాస్త తేడా ఉంది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర గతంలోనే ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం.. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండనుంది. తాజాగా వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ ధర రూ.5,000గానూ, హైఎండ్ వేరియంట్ ధర రూ.7,000గా ఉండనుంది. వినాయక చవితి పర్వదినం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ జరగనుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుందని తెలుస్తోంది. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. 4జీ వోల్టే, డ్యూయల్ సిం సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు ప్రభావవంతంగా పనిచేయడానికి డ్యుయోగో అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో గూగుల్ కెమెరా గో అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1,440 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఇందులో క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: సరికొత్తగా రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్

Advertisement

తాజా వార్తలు

Advertisement