Sunday, May 5, 2024

జూనియ‌ర్ ఎన్టీఆర్ తో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ..

జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. మరోవైపు ఆయన నటించే 30వ చిత్రం వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించే చిత్రా న్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కొసరాజు హరి కృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ (దివంగత శ్రీదేవి కుమార్తె) హీరోయిన్‌గా నటిస్తోం ది. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ విడుదల చేసింది. ఇదేనెలలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభి స్తా రు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మల యాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నా హాలు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు సినిమా టోగ్రాఫ ర్‌ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబుసిరిల్‌, ఎడిటర్‌ శ్రీకర ప్రసాద్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్‌ ఈ చిత్రానికి సంగీతా న్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటి జాన్వీకపూర్‌ సంతోషం వ్యక్తం చేసింది. నేను ఎంతగానో అభిమా నించే ఎన్టీఆర్‌తో కలిసి నటిం చడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement