Thursday, May 9, 2024

నిర్ణీత గ‌డువులోగా ఐలాండ్ ప‌నులు పూర్తి చేయాలి : మంత్రి గంగుల

తెలంగాణ చౌక్ లో జరుగుతున్న ఐలాండ్ పనులను పరిశీలించిన బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప‌రిశీలించారు. ప‌నుల్లో నాణ్య‌త పాటించాల‌ని, నిర్ణీత గ‌డువులోగా ఐలాండ్ ప‌నులు పూర్తి కావాల‌ని అధికారుల‌కు సూచించారు. అధికారుల‌తో కాసేపు ముచ్చ‌టించి ప‌నుల‌కు సంబంధించిన వివ‌రాలు తెలుసుకున్నారు. కరీంనగర్ లో జుంక్షన్ ల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఈ పనులు పూర్తి అయిన తరువాత ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆయ‌న వెంట‌ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement