Sunday, April 28, 2024

మూడు పెండింగ్ బిల్లుల‌కు ఆమోదం…రెండింటిని రాష్ట్ర‌ప‌తికి పంపిన గ‌వ‌ర్న‌ర్..

హైదరాబాద్: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ వ‌ద్ద గ‌త కొంత కాలంగా పెండింగ్ బిల్లుల‌కు క‌ద‌లిక వ‌చ్చింది.. మొత్తం 10 బిల్లుల‌లో మూడింటికి ఆమోదముద్ర వేశారు..రెండు బిల్లుల‌ను రాష్ట్ర‌ప‌తి ప‌రిశీల‌న‌కు పంపారు.. మ‌రో రెండు బిల్లుల‌ను ప్ర‌భుత్వానికి తిప్పిపంపారు.. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద మ‌రో మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.. కాగా, 2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను రాష్ట్ర ప‌భుత్వం అధికారిక ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. అయితే ఆ బిల్లుల‌పై గ‌వ‌ర్న‌ర్ ఎటువంటి నిర్ణ‌యం తీస‌కోక‌పోవ‌డంతో తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్ సుప్రీం కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది.. ఈ ద‌శ‌లో గ‌వ‌ర్న‌ర్ బిల్లుల‌పై ఒక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement