Wednesday, May 8, 2024

Womens T20 World Cup | ఆసీస్‌తో అమీతుమీ.. రేపు మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీస్‌

టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా, భారత్ జట్లు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్‌ ఫేవరెట్‌గా ఆసీస్‌ బరిలోకి దిగుతుండగా, బలమైన జట్టుగా హర్మన్‌ప్రీత్‌ బృందం పోటీకి సై అంటోంది. కేప్‌టౌన్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా హాట్‌ ఫేవరెట్‌గా ఉంది. టీమిండియా ఐదేళ్లుగా అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ, పెద్ద ట్రోఫీని గెలవలేకపోయింది. ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఇప్పుడు లభించింది. గతంలో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లోను, ఇటీవల బర్మింగ్‌హామ్‌లో జరిగినకామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది.

స్మృతి మంధాన, రిచా ఘోష్‌ వంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే రాణిస్తుండటంతో భారత బ్యాటింగ్ కాస్త‌ బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో రేణుకా సింగ్‌పై జట్టు ఆధారపడింది. రేణుక ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. లీగ్‌దశలో భారత మహిళలు నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని నెగ్గారు. మొత్తంగా ఫరవాలేదు అనిపించేలా ఆడారు. ఇంగ్లండ్‌ చేతిలో పరాభవం బ్యాటింగ్‌ వైఫల్యాలను బయటపెట్టింది. ఆసీస్‌ వంటి అజేయ జట్టుతో తలపడేముందు హర్మన్‌ సేన వైఫల్యాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం నుంచి గట్టెక్కాలి. రిచాఘోశ్‌ను మినహాయిస్తే ఏ ఒక్కరూ భారీ సిక్సర్లు బాదలేక పోతున్నారు.

డాట్‌ బాల్స్‌ ఎక్కువగా ఉండ‌డం స్కోరు వేగాన్ని దెబ్బతీస్తోంది. మూడేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షఫాలి వర్మ బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకోలేక పోతున్నది. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం, షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనే విషయాలపై ఆమె దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జెమిమా రొడ్రిగ్స్‌ మెరుగైన ప్రదర్శన ఆస్ట్రేలియాపైనా కొనసాగిస్తే గెలుపు సులువు అవుతుంది. ఇక అన్నాబెల్‌ సదర్లాండ్‌, జార్జియా వేర్‌హామ్‌ వంటి వారితో ఆస్ట్రేలియా ఆధిపత్య శక్తిగా ఉంది. మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలోని జట్టు 22 మ్యాచ్‌ల వరుస విజయాలతో సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మార్చి 2021లో న్యూజిలాండ్‌పై చివరిసారి ఓటమిని ఎదుర్కొన్న ఈ జట్టుకు భారత్‌పై మెరుగైన రికార్డు ఉంది. ముంబైలో జరిగిన సిరీస్‌లో 4-1తో ఓడించింది.

- Advertisement -

నాలుగోసారి సెమీస్‌కు
ఐర్లాండ్‌తో కీలకమైన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీ (87) బాదడంతో 155 రన్స్‌ చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐదు పరుగులతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. ఆరు పాయింట్లతో సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2009, 2010, 2018లో భారత జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది.

జట్లు :
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్‌, జెమిమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్‌, రేణుకా ఠాకూర్‌, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్‌, రాజేశ్వరి గయాక్వాడే.

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (సి), అలిస్సా హలీ, డార్సీ బ్రౌన్‌, ఆష్లీ గార్డనర్‌, కిమ్‌ గార్త్‌, #హథర్‌ గ్రా#హం, గ్రేస్‌ హారిస్‌, జెస్‌ జోనాస్సెన్‌, అలానా కింగ్‌, తహయా మెక్‌గ్రాత్‌, బెత్‌ మూనీ, ఎల్లిdస్‌ పెర్రీ, మేగాన్‌ షుట్‌, అన్నాబెల్‌ సదర్లాండ్‌, జార్జియా వారీహామ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement