Friday, April 26, 2024

Cricket | విజయం ముంగిట భారత్‌.. మరో 100 పరుగులే టార్గెట్​

భారత్‌ , బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలుత ఓవర్‌నైట్‌ స్కోరు 7/0తో ఆట ప్రారంభించిన బంగ్లా 231 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఈ క్రమంలో 145 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. దీంతో రెండో టెస్టు కాస్రత సవత్తరంగా మారింది. ఈ మ్యాచ్​లో భారత్‌ మరో 100 పరుగులు చేస్తే విజయం సాధించినట్టే.

మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45 రన్స్‌ చేసింది. మరో 100 రన్స్‌ చేస్తే ఇండియా టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. నైట్‌ వాచ్‌మెన్‌ అక్షర్‌ పటేల్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌ను బంగ్లా బౌలర్లు తీవ్రంగా దెబ్బకొట్టారు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ మరోసారి ఘోరంగా విఫలం కాగా, తొలి టెస్టులో రాణించిన శుభమన్‌, చెతేశ్వర్‌ పుజారాలు కూడ సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. జయదేవ్‌ ఉనాద్కత్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 145 టార్గెట్‌ చిన్నదే అయినప్పటికీ బంగ్లా బౌలర్లు పోరాడడంతో భారత్‌ రెండో ఓవర్‌లోనే రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement