Friday, April 26, 2024

వేసవికి ముందే పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. పెరిగిన వ్యవసాయం, విద్యుత్‌ వాడకం..

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : వేసవి కాలం ఆరంభానికి ముందే విద్యుత్‌ వినియోగం రోజు రోజుకు పేరుగుతోంది. పగటిపూడ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో.. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో పాటు రిప్రిజ రేటర్ల వాడకాన్ని వినియోగదారులు పెంచడంతో విద్యుత్‌ వినియోగం అమాంతం పెరుగుతూ వస్తోంది. దీంతో పాటు నీటి లభ్యత సమృద్ధిగా ఉండటం, భూగర్బ జలాలు పెరగడం వల్ల వ్యవసాయ మోటార్ల వాడకం నిరంతరం ఉండంతో విద్యుత్‌ ఖర్చు పెరుగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి మాసంలోని ఇదే సమయంలో.. ఈ ఏడాదిలో ప్రస్తతం విద్యుత్‌ వినియోగం భారీగానే పెరిగింది. సొమవారం ఒక్క రోజే 14169 మోగావాట్ల వరకు ఉండగా, 290 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ వాడకం నమోదైంది.

- Advertisement -

గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం పరిశీలిస్తే 19వ తేదీన 14159 మెగావాట్లు కాగా, 286 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఖర్చయింది. 18న 14370 మెగావాట్లతో 286.6 మిలియన్‌ యూనిట్లు, 17న 14371 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా, 289.7 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ఒక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవ్వాల (సోమవారం) ఒక్క రోజే 2700 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. గత ఏడాది ఇదే రోజు 1800 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తరణ వేగంగా పెరగడం, పరిశ్రమలు, ఇళ్ల నిర్మాణాలు పెరగడంతో విద్యుత్‌ వాడకం కూడా నిత్యం పెరుగుతూ వస్తోంది.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడటం, భూగర్బ జలాలు పెరగడంతో వ్యవసాయం కూడా పెరగడం దీంతో విద్యుత్‌ వాడంకం కూడా పెరిగింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు కూడా 26 లక్షలకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరం ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం వల్ల విద్యుత్‌ వినియోగం పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, 2022 ఫిబ్రవరి 19న 11852 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. 18న 11729 మెగావాట్లు, 17న 11711 మెగావాట్లు నమోదు కాగా, 20న 11589 మెగావాట్ల విద్యుత్‌ వాడకం నమోదైంది. 2021 సంవత్సరం ఫిబ్రవరి 20న 12507 మెగావాట్లు, 19న 12465 మెగావాట్లు, 18న 13049 మెగావాట్లు, 17న 12195 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదు అయింది.

పెరిగిన వ్యవసాయ, గృహా విద్యుత్‌ కనెక్షన్లు..

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, గృహా, వివిధ రకాల పరిశ్రమలకు కలిపి మొత్తం గతేడాది ఏప్రిల్‌ 30 వరకు 1,04,83,379 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 26 లక్షలు, గృహాలకు సంబంధించి విద్యుత్‌ కనెక్షన్లు 7748286 కనెక్షన్లు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్‌ డిమాండ్‌ కేవలం 6666 మెగావాట్ల డిమాండ్‌ మాత్రమే ఉండగా, ఇప్పుడు 14 వేల మెగావాట్లకు చేరుకున్నది. మరో రెండు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 15 నుంచి 16 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగిన విద్యుత్‌కు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement