Sunday, April 11, 2021

పెరుగుతున్న కరోనా తీవ్రత- 24 గంటల్లో 446 మంది మృతి

దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 96,982 కరోనా కేసులునమోదయ్యాయి.తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు 1,26,86,049 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఇందులో 1,17,32,279 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,88,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు గడిచిన 24 గంటల్లో ఇండియాలో 50,143 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో కరోనాతో 446 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 1,65,547 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News