Wednesday, May 8, 2024

భార్యతో మాట్లాడించాలని సుప్రీం కోర్టు లో భర్త పిటీషన్..

తన భార్యతో మాట్లాడించాలన్న  ఓ భర్త కోర్టులో పిటిషన్ వేశాడు. హైదరాబాద్‌లోని అత్తమామలు తన భార్యను బలవంతంగా బందీ చేశారంటూ పంజాబ్‌లోని మొహాలికి చెందిన సచిన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు స్పందించి, తక్షణమే ఆ మేరకు అవకాశం కల్పించాలని హైదరాబాద్‌ పోలీసులను ఆదేశించింది.

పిటిషన్‌ బెయిల్‌ వంటి సాధారణ పిటిషన్‌ కాదని, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ అని, దీనిపై పోలీసులుకు ఏమైనా సూచనలు చేశారా అని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌ తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా లేదని ప్రభుత్వ న్యాయవాది స్వేనా పేర్కొనగా… వాస్తవాలు గుర్తించారా.. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లను అత్యవసరంగా పరిగణించాలని పేర్కొంది. పిటిషన్‌లో ఆరోపణల మేరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ నివేది వాస్తవ ఆధారాలతో నివేదిక ఇవ్వాలని  ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఈ నెల 23న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: రాజ్ భవన్ లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement