Saturday, May 4, 2024

ఇ-బస్సుల కోసం ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్‌.. 550 బస్సులు కొనుగోలు చేయనున్న టీఎస్‌ ఆర్టీసీ

హైదరాబాద్‌ : మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న విద్యుత్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. తెలంగాణ ఆర్టీసీ నుంచి కంపెనీకి 550 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఆర్డర్‌ వచ్చిందని ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే.వీ ప్రదీప్‌ తెలిపారు. దక్షిణ భారత్‌ నుంచి కంపెనీకి వచ్చిన వాటిలో ఇదే పెద్ద ఆర్డర్‌ ఆయన తెలిపారు.ఈ ఆర్డర్‌లో భాగంగా 50 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ 12 మీటర్ల పొడవు ఉంటే ఇంటర్‌సిటీ కోచ్‌లతో పాటు, 550 లో ఫ్లోర్‌ ఇంట్రాసిటీ ఇ-బస్సులను తెలంగాణా ఆర్టీసీకి అందించనున్నట్లు కేవీ. ప్రదీప్‌ తెలిపారు. దశల వారిగా ఈ బస్సులను సంస్థకు అందిస్తామన్నారు. నగరంలో తిరిగే ఇంట్రాసిటీ బస్సులు ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలో నడపనున్నారు. వీటి వల్ల భారీగా కాలుష్యం తగ్గడంతో పాటు, శబ్ద కాలుష్యం కూడా తగ్గుందని ఆయన చెప్పారు. 2019 నుంచి ఒలెక్ట్రా కంపెనీతో టీఎస్‌ ఆర్టీసీ భాగస్వామ్యం కలిగి ఉంది. సంస్థకు ఇప్పటికే 40 ఇ-బస్సులను కంపనీ అందించింది. వీటని ఆర్టీసీ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిపిస్తోంది.

- Advertisement -

50 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ 12 మీటర్ల ఇంటర్‌ సిటీ విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ప్రధానంగా హైదరాబాద్‌, విజయవాడ మధ్య నడిపించాలని భావిస్తోంది. ఈ బస్సులు ఒక సారి ఛార్జ్‌ చేస్తే 325 కిలో మీటర్ల దూరం ప్రయాణించగలవు. హైదరాబాద్‌ నగరంలో తిరిగే 500 ఇ-బస్సులు ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించగలవు. టీఎస్‌ ఆర్టీసీ రానున్న రెండు సంవత్సరాల్లో 3,400 విద్యుత్‌ బస్సులు సమకూర్చుకుంటుందని సంస్థ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు. వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు అందించనున్నారు. 2025 మార్చి నాటికి హైదరాబాద్‌లో పూర్తిగా విద్యుత్‌ బస్సులే నడిపేందుకు ఆర్టీసీ ప్రాణాళికలు రూపొందించుకుందని సంస్థ ఎండీ, వైస్‌ ఛైర్మన్‌ సజ్జనార్‌ తెలిపారు. మొదటి దశలో రానున్న 550 ఇ-బస్సులు జీసీసీ కింద వస్తాయని, ఇవన్నీ దశలవారిగా అందుబాటులోకి వస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement