Thursday, April 25, 2024

ఆంధ్ర ప్రభ ఢిల్లీ బ్యూరో ప్రతినిధి స్వరూపతో పాటు మరో 27 మంది మహిళలకు తెలంగాణ‌ ప్రభుత్వ ఆవార్డులు

హైద‌రాబాద్ : విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పురస్కరించుకొని తెలంగాణ‌ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సంవ‌త్స‌రానికి గానూ మొత్తం 27 మందికి అవార్డుతోపాటు ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. జర్నలిజం విభాగంలో ఆంధ్ర ప్రభ ఢిల్లీ బ్యూరో ప్రతినిధి స్వరూప పొట్లపల్లి ఈ అవార్డ్ కు ఎంపిక అయ్యారు.

స్వరూప పొట్లపల్లి

అవార్డు గ్రహీతలు…

బానోతు జ్యోతి – అంగ‌న్‌వాడీ టీచ‌ర్ , గుండా రాజ‌కుమారి – సెంట‌ర్ కోఆర్డినేట‌ర్, భ‌రోసా సెంట‌ర్., ఆల్ఫి కిండ‌న్‌జెన్ – సోష‌ల్ స‌ర్వీస్., మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే స‌ర్పంచ్., సుజాత దీక్షిత్ – థియేట‌ర్. , స్వ‌రూప పొట్ల‌ప‌ల్లి – జ‌ర్న‌లిజం. ,డాక్ట‌ర్ బండారు సుజాత శేఖ‌ర్ – ఫోక్ లిట‌రేచ‌ర్,. అరుణ నార‌ద‌భ‌ట్ల – లిట‌రేచ‌ర్,. డాక్ట‌ర్ అమూల్య మ‌ల్ల‌న్న‌గారి – హెల్త్నారా , విజ‌య‌ల‌క్ష్మి(పీహెచ్) – పెయింట‌ర్. ఓఎన్ఐ సిస్ట‌ర్స్(వినోద‌, విజ‌య‌, విజ‌య‌ల‌క్ష్మి) – మ్యూజిక్. రుక్మిణి, ఇన్‌స్పెక్ట‌ర్ – షీ టీమ్స్ భ‌రోసా సెంట‌ర్. అన‌సూయ‌, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్,. అన్వితా రెడ్డి – మౌంటెయిన‌ర్. ,. త్రిష గొంగ‌డి – స్పోర్ట్స్(అండ‌ర్ -19 క్రికెట‌ర్),. డాక్ట‌ర్ అనురాధ త‌డ‌క‌మ‌ళ్ల – క్లాసిక‌ల్ డ్యాన్స్,. దంటు క‌న‌క‌దుర్గ – సోష‌ల్ యాక్టివిస్ట్, డాక్ట‌ర్ మాల‌తి – హెల్త్, సూప‌రింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్ల‌బుర్జ్, స‌మంత రెడ్డి – వుమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్,. క‌ర్నె శంక‌ర‌మ్మ – కిన్నెర‌, ఫోక్ , డాక్ట‌ర్ గుడూరు మ‌నోజ – ఆద్య క‌ళ‌., సామ‌ళ్ల శ్వేత – క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్, జి. నందిని – సూప‌ర్‌వైజర్, నిజామాబాద్(అ) ప్రాజెక్ట్. ర‌జియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్,. కౌడిప‌ల్లి, ఐసీడీఎస్ – న‌ర్సాపూర్ , ఎం. కృష్ణ‌వేణి – ఆశా వ‌ర్క‌ర్. , ఇందిర – ఏఎన్ఎం. , డాక్ట‌ర్ కే రాణి ప్ర‌సాద్ – లిట‌రేచ‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement