Wednesday, May 8, 2024

లోకేష్ క‌న‌గ‌రాజ్ తో ప్ర‌భాస్ మూవీ..!

పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. కాగా ఆయ‌న చేతిలో ఇప్ప‌టికే ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. తాజాగా ప్రభాస్ మరో సినిమాకు ఓకే చెప్పబోతున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అది కూడా సౌతిండియాలో సెన్సేషనల్ దర్శకుడితో అని స‌మాచారం.

కార్తితో ఖైదీ, కమల్ హాసన్‌తో విక్రమ్‌ తీసిన లోకేష్‌ కనగరాజ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో, అతనితో సినిమా చేసేందుకు చాలామంది బడా స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. లోకేష్‌ మాత్రం ప్రభాస్‌ కోసం వెయిట్ చేస్తున్నాడని వినికిడి. టాలీవుడ్ రెబల్ స్టార్ తో ఓ భారీ యాక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభాస్, లోకేశ్ కనగరాజ్ ఇటీవలే సమావేశమై చర్చించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజ‌మైతే ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement