Sunday, May 12, 2024

బాల‌కృష్ణ విల‌న్ కి భారీ వెల్ క‌మ్

హీరో బాల‌కృష్ణ 107వ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ మూవీని గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫస్టు షెడ్యూల్లో రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే విలన్ గా కన్నడ ఆర్టిస్ట్ దునియా విజయ్ కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. కన్నడలో విలన్ రోల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న దునియా విజయ్, ఆ తరువాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. బాలకృష్ణ సినిమా కోసం దునియా విజయ్ రంగంలోకి దిగిపోయాడు. ఆయనకు బొకే అందజేసి మరీ గోపీచంద్ మాలినేని టీమ్ సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పింది. ఇక ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుండగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement