Thursday, May 2, 2024

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుకి మ్యూజిక్ అందిస్తోన్న – కీర‌వాణి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీతాన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి అందిస్తున్నారు. ఈ విషయాన్ని కీరవాణీ తన సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తో దిగిన పిక్‌ ను షేర్‌ చేశారు.కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నఈ పిక్చర్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement