Saturday, April 27, 2024

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు.. యాక్ష‌న్ సీన్స్ పై అప్ డేట్ ఇచ్చిన కొరియోగ్రాఫ‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీన్స్ ని గ‌త కొద్ది రోజులుగా రామోజీ ఫిలింసిటీలో షూట్ చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మేఘసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు‌‌.. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ విషయాన్ని యాక్షన్‌ కొరియోగ్రాఫ‌ర్ విజయ్‌ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నిరంతరం మద్దతు అందిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ బాబుకు, మీరందిస్తున్న ప్రశంసలు, ప్రేమకు ధన్యవాదాలు. ఇపుడు తర్వాతి సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్‌ మొదలైంది..అని విజయ్‌ అప్‌డేట్ అందించారు.పవన్ కల్యాణ్‌ నుంచి దేవుడి ప్రతిమను అందుకుంటున్న స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విజయ్‌. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement