Saturday, April 27, 2024

Varanasi: జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని రక్షించాలి.. తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా కాపాడాలే: సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు ఏరియాలో ఉన్న ‘శివలింగం’ని తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా సురక్షితంగా ఉంచాలని ఇవ్వాల సుప్రీంకోర్టు వెల్లడించింది. మే 17న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ఇవ్వాల సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది  మే 17న ఇచ్చిన ఉత్తర్వులకు రేపటితో (నవంబర్ 12) గడువు ముగియనున్న దృష్ట్యా హిందూ సంఘాలు మరోసారి కోర్టుని ఆశ్రయించాయి. 

అసలు జ్ఞానవాపి వివాదం ఏంటంటే..

1991 నాటి నుంచి ఈ వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన అంశమిది. అంజుమన్ ఇంతేజామియా మసీదు వారణాసి వారు, హిందూ భక్తులు, ఇతరులు కలిసి వారణాసిలోని సివిల్ కోర్టుతోపాటు అలహాబాద్ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. జ్ఞాన్వాపి మసీదు సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు 1991లో ఒక దావా వేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాశీ  విశ్వేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత జ్ఞానవాపి మసీదు నిర్మించినట్టు వారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

1991లో వేసిన ఈ దావా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. అంతేకాకుండా జ్ఞానవాపి మసీదు సముదాయంలోని పురాతన శివాలయంలో పూజలు, కైంకర్యాల వంటి ఆచారాలు నిర్వహించాలని కోరుతూ గత ఏడాది శివ భక్తులు కొందరు మరొక దావా వేశారు. దీనిని ‘పురాతన దేవాలయం’గా పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు కూల్చివేసిన హిందూ కట్టడంలోని కొంతభాగంలో మసీదు నిర్మించారనే వాదనలను బలపరుస్తూ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే.. ఈ వాదనలు విన్న కోర్టు జ్ఞానవాపి సముదాయాన్ని సర్వే చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో మసీదు వజుఖానాలో ‘శివలింగం’ ఉన్నట్టు వెల్లడయ్యింది. ఇక.. అప్పటి నుంచి హిందూ సంఘాలు తమ పోరాటాన్ని విస్తృతం చేశాయి. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement