Wednesday, May 8, 2024

నిరుపేదలకు అండగా ప్రభుత్వం : గంగుల కమలాకర్..

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన 50 లక్షల 41 వేల 500 విలువ గల131 చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ అందించారు… ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు.తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామనిమంత్రి భరోసా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement