Thursday, April 25, 2024

24 గంటలు నాణ్యమైన విద్యుత్.. సీయం దార్శనికతకు నిదర్శనం : సియండి గోపాల్ రావు…

ప్రభన్యూస్, వరంగల్ : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విద్యుత్తు వినియోగం రోజు రోజుకూ డిమాండ్ ఉన్న ప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మెరుగైన విద్యుత్ అందిస్తున్నామని ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్ పీడీసిఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అన్నమనేని. గోపాల్ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుల మార్గదర్శనమే కారణమన్నారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి ఎన్ పీడీసిఎల్ సంస్థకు వివిధ కేటగిరీ లలో ఏడు అవార్డులు దక్కాయని తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ రావు మాట్లాడుతూ ఒక డిస్కంకు ఇన్ని అవార్డులు రావడం ఇదే మొదటి సారి అన్నారు.

సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కృషి ఫలితమేని చెప్పారు. బెస్ట్ పర్ ఫార్మింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, బెస్ట్ స్టేట్ టూప్రమోట్ రెనివబుల్ ఎనర్జీ, ప్రమోట్ కన్యూమర్ అవేర్ నెస్, ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్. ఎరక్షన్ ఆఫ్ కెపాసిటీ బ్యాంక్స్, సోలార్ జనరేషన్, ఇన్టీగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ తదితర అంశాలలో అవార్డులు గర్వకారణమన్నారు. ఈ అవార్డులను కర్నాటక రాష్ట్రంలోని బెలగాంలో ఏప్రిల్ 9న జరిగే రిట్రీట్ లో బహుకరిస్తారని గోపాల్ రావు తెలిపారు. తమ సంస్థ రాష్ట్రంలో ని 17 జిల్లా లోని 63 లక్షల వినియోగదారులకు సేవలందిస్తున్న దని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement