Saturday, May 21, 2022

తెలంగాణ ప్ర‌భుత్వానికి ‘మంచుల‌క్ష్మీ’ విన్న‌పం

తెలంగాణ ప్ర‌భుత్వంపై న‌టి, నిర్మాత మంచుల‌క్ష్మీ ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ‌లో అమ‌లు అవుతోన్న మ‌న ఊరు మ‌న బ‌డి కార్య‌క్ర‌మం చాలా బాగుంద‌న్నారు. టీచ్ ఫ‌ర్ ఛేంజ్ అనే ట్ర‌స్ట్ ద్వారా ప‌లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో దాదాపు ఏడు సంవ‌త్స‌రాలుగా ఆమె ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించి, విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఈ అనుభవంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ఒక సూచన చేశారు. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ పై దృష్టి సారించాలని ఆమె విన్నపం చేశారు. ఈ పద్ధతి వల్ల రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అందువల్ల దీనిపై దృష్టి పెట్టాలని మంచు లక్ష్మి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement