Tuesday, October 8, 2024

అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరి మలకు 22 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లాలనుకుంటున్న భక్తుల కు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరి మలకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 22 రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో రాకేష్‌ తెలిపారు.

సికింద్రాబాద్‌ – కొల్లం, నర్సాపూర్‌ – కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ-కొట్టాయం, కొల్లం- సికింద్రాబాద్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయని వెల్లడించారు. శబవరిమల ప్రత్యేక రైళ్ల తేదీలు, సమయాన్ని విడుదల చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement