Thursday, November 7, 2024

ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ : 2023 – 24 విద్యాసంవత్సరానికి గాను వచ్చే నెల 3న జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌)కు దఖాస్తులు చేసుకున్న విద్యార్ధుల హాల్‌ టికెట్లను ఆన్‌లైన్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి తెలిపారు.

కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల యు – డైస్‌ కోడ్‌ను ద్వారా లాగిన్‌ అయ్యి తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులకు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి అందజేయాలని దేవానందరెడ్డి సూచించారు. 3వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement