Saturday, May 4, 2024

Gold Rate Today: శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు..

గోల్డ్, వెండి రేట్లు ఇటీవలి కాలంలో సరికొత్త రికార్డులకు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.700 మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు రూ.56 వేల 500 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.760 పడిపోయి ప్రస్తుతం రూ.61 వేల 640 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 తగ్గి రూ.56 వేల 650 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు ఢిల్లీలో తులానికి రూ.760 తగ్గి ప్రస్తుతం రూ.61 వేల 790 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే భారీగా కుప్పకూలింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా రూ.1300 పడిపోయింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ.82 వేల 400 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.550 తగ్గి ప్రస్తుతం రూ.77 వేల 700 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement