Thursday, May 16, 2024

జీహెచ్ ఎంసీ స‌రికొత్త ఆలోచ‌న‌.. భూ ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌కుండా పార్కులుగా ఖాళీస్థలాలు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : హైద‌రాబాద్ నగరాన్ని పచ్చగా మార్చడంతోపాటు నిరుపయోగ భూమలు ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ఆలోచనలకు శ్రీకారంచుట్టింది. నగరవ్యాప్తంగా ఉన్న నిరుపయో గ భూములు, ఫ్లైఓవర్ల ఖాళీస్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. పలువురు చిన్నచిన్న వ్యాపార కేంద్రాలుగా మర్చుకుంటుండగా, మరి కొంతమంది ఏకంగా పక్కానిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని రక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగ పడేలా చేసేందకు ఖాళీ స్థలాల్లో పార్కు లు, ఓపెన్‌ జిమ్‌లు, నడక దారులతో పాటు చెట్లను నా టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ ఖాళీ స్థలంలో ఇప్పటికే పార్కును నిర్మించిన జీహెచ్‌ఎంసీ తాజాగా శేరిలింగంపల్లి ఓల్డ్‌ ఎంఐజీ కాలనీలో వృథాగా ఉన్న 2.5 ఎకరాల్లో థీమ్‌ పార్కు ను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో నగర గర వ్యాప్తంగా ఉన్న అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పార్కులుగా తీర్చి దిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబందించి నగర వ్యాప్తంగా ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

- Advertisement -

అన్ని సౌకర్యాలు..

శేరిలింగంపల్లి ఓల్డ్‌ ఎంఐజీ కాలనీతో పాటు ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ ఖాళీ స్థలంలో కామినేని ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన పార్కుల్లో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శిల్పాలు, ఫౌంటేన్లు, ఓపెన్‌ జిమ్‌, నడక దారులతో పాటు ప్రజలు కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేశారు. సాధారణ జాతుల చెట్లను కాకుండా ఎక్కువ ఆక్సిజన్‌ విడుదల చేసే ఎంపిక చేసిన మొక్కలను నాటారు. పిల్లల నుంచి మొదలుకుని పెద్దల వరకు అన్ని వయసుల వారు సేద తీరడంతో పాటు ఆట విడుపు కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.

దశల వారిగా నగరమంతా విస్తరణ..

నగర వ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా విస్తరించే ప్రక్రియను దశల వారీగా నగరమంతా విస్తరించేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మొదటి దశలో.. ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ ఖాళీ స్థలంతో పాటు శేరిలింగంపల్లి ఓల్డ్‌ ఎంఐజీ కాలనీలో వృథాగా ఉన్న 2.5 ఎకరాల్లో థీమ్‌ పార్కును ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో నగర గర వ్యాప్తంగా ఉన్న అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పార్కులుగా తీర్చి దిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబందించి నగర వ్యాప్తంగా ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ది చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement