Monday, May 13, 2024

హైదరాబాద్‌లో మరో రెండు నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు.. టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న భవన నిర్మాణ వ్యర్థాల కట్టడికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం నగరంలో మరో రెండు చోట్ల వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ఏడాదిలోపే ఆ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

ఇప్పటికే హైదరాబాద్‌ పరిధిలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. ఇవి విజయవంతం కావడంతో మరో రెండు చోట్ల ప్లాంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. కొత్తగా ఈ ప్లాంట్లను సికింద్రాబాద్‌, చార్మినార్‌ జోన్‌లలో నిర్మించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement