Saturday, May 4, 2024

‘గ‌ని’ ట్రైల‌ర్ కి ముహూర్తం ఖ‌రార్

హీరో వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను మార్చి 17 ఉద‌యం 10.30 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సాయి మంజ్రేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లుబాబీ, సిద్ధూముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement