Monday, May 6, 2024

ఉక్రెయిన్ పౌరుడి క‌ళ్ల‌ముందే బ్లాస్ట్ అయిన ర‌ష్యా మిస్సైల్ – వైర‌ల్ గా వీడియో

ఉక్రెయిన్ పౌరుడి క‌ళ్ల ముందే బ్లాస్ట్ అయింది ర‌ష్యా మిస్సైల్. ఆ పేలుడు తీవ్ర‌త‌, శ‌బ్దానికి ఆ పౌరుడు ఉలిక్కిప‌డి షాక్ లోకి వెళ్లి..వెను వెంట‌నే ప‌రుగు తీశాడు. కొద్దీ దూరం వెళ్లే వరకు ఆయనకు ఏం జరిగిందో అర్థం కానట్టే నడిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సైన్యం రెండు వైపుల నుంచి మోహరించి ఉన్నది. ఈ నగరంలో 30 లక్షల మంది పౌరులు నివసిస్తుండేవారు. కానీ, రష్యా దాడులు ప్రారంభించిన కారణంగా సుమారు సగం మంది నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజా రష్యా దాడిలో ఇద్దరు పౌరులు దుర్మరణం చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కీవ్ నగరంలోని కిరిలివ్‌స్కా వీధిలోని పార్క్ కనిపిస్తున్నది. కీవ్ నగరానికి వాయవ్య భాగంలో రష్యా దాడులను పెంచింది. ఈ ప్రాంతంలో లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో విరుచుకుపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement